మలబద్ధకం
ఇది చాలా సామాన్య సమస్య. దీని లక్షణాలు మనుషులను బట్టి మారుతూ ఉంటుంది. చాలామందిలో మలవిసర్జన కష్టంగా జరగడం. వారానికి మూడు - నాలుగు సార్లు , ఇంకా -తక్కువ సార్లు కావడం .
నివారణ మార్గాలు:
రోజుకు నీరు లేదా ద్రవ పదార్థాలు నాలుగు లీటర్లు వరకు తీసుకోవాలి. పండ్లు, కూరలు ఎక్కువగా తీసుకోవాలి. ఉదయాన్నే వ్యాయామం చేయాలి. దొడ్లో సరిగ్గా కూర్చోవాలి. ముందుకు వంగి మోచేతులతో మోకాళ్ళ పై ఉంచుకోవాలి. పొట్టను లోనికి లాగి బయటకు నెట్టాలి. కాళ్ల మీద కాస్త ఎత్తు వేసుకోవాలి.